గద్వాల (ప్రతినిధి) జూన్ 5 (ప్రభ న్యూస్) : గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ నిర్మాణ పనులను ఇవాళ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయడం జరిగిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో గద్వాల జిల్లాలో మెడికల్ కాలేజీ మంజూరు చేసుకోవడం జరిగిందని, దాదాపుగా మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు పూర్తి కావడం జరిగిందన్నారు. త్వరలోనే అన్ని రంగులతో అన్ని పరికరాలతో ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చి త్వరలో మెడికల్ కాలేజీ ఆసుపత్రిని ప్రారంభించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ సంవత్సరం మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు త్వరలోనే ప్రారంభం రావడం జరుగుతుందని, అదేవిధంగా తరగతులు కూడా ప్రారంభించి మెడికల్ విద్యార్థులకు అన్ని విధాలా సౌకర్యాలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మెడికల్ కాలేజీలో సౌకర్యాలను ఏర్పాటు చేసి పేద ప్రజలకు వైద్యం అందించే విధంగా తమ వంతు కృషిచేసి ప్రభుత్వ సహకారంతో కూడా అన్ని విధాలుగా మెడికల్ కాలేజ్ కి తన వంతు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు, జిల్లా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు గడ్డం కృష్ణారెడ్డి, జి.వేణుగోపాల్, ఎంపీపీ విజయ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్స్ మురళి, నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, దౌలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంగడి బసవరాజ్, మహబూబ్, నవీన్ రెడ్డి, భగీరథ వంశీ, కురుమన్న, మధు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.