గద్వాల ప్రతినిధి, జనవరి 22 (ప్రభ న్యూస్): సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలోని 300 పడకల ఆసుపత్రి సమీపంలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స అందించేందుకు క్రిటికల్ కేర్ బ్లాక్ నేషన్ లో భాగంగా రూ.23.75 కోట్లతో గద్వాల జిల్లాకు మంజూరైన క్రిటికల్ కేర్ బ్లాక్ భవన నిర్మాణానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నేడు అయోధ్య లో శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అయోధ్య రామ దేవాలయం ప్రారంభోత్సవం ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
మానవసేవే మాధవసేవ భాగంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా క్రిటికల్ కేర్ బ్లాక్ ను గద్వాల జిల్లా మంజూరు కావడం జరిగినదన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడటం, పాముకాటు వంటి సంఘటనలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులకు చికిత్స అందించేందుకు క్రిటికల్ కేర్ భవనం నిర్మిస్తున్నట్లు అని తెలిపారు. గతంలో కర్నూలు హైదరాబాదు వంటి ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఉండేది అని అక్కడ వెళ్లే లోపు ప్రమాదంతో గాయపడిన వారికి దారుణమైన పరిస్థితి ఏర్పడేదని అలాంటి పరిస్థితి భవిష్యత్తులో లేకుండా ఉండాలని గద్వాలలోని క్రిటికల్ కేర్ బ్లాక్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. త్వరలో నిర్మాణం పనులు పూర్తి చేసి అన్ని రకాల సదుపాయాలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని తెలిపారు. అనంతరం నర్సింగ్ కాలేజీ హాస్టల్ నిర్మాణం పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, ఎంపీపీ ప్రతాప్ గౌడ్, వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్స్ మురళి, శ్రీను ,నరహరి గౌడు, కృష్ణ, మహేష్, గద్వాల టౌన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గోవిందు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు నాగులు యాదవ్, సుధాకర్, రిజ్వాన్, వీరేష్, నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.