దేవరకద్ర : నియోజకవర్గపరిధిలోని అన్నసాగర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోసం స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి స్థల పరిశీలన చేశారు. గ్రామంలో ప్రజలు ఆసుపత్రి కోసం వివిధ గ్రామాలకు వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉందని అందుకు దాన్ని దృష్టిలో పెట్టుకొని నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలన చేశామని ఆయన తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి స్థలం ఎంపిక కాగానే పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట అధికారులు నాయకులు ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement