Friday, November 22, 2024

పాలమూరు పర్యాటకంపై శాసన సభలో మాట్లాడిన మంత్రి..


మహబూబ్‌నగర్‌ : తెలంగాణ శాసన సభ సమావేశంలో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర ఎక్సైజ్‌ , పర్యాటక శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్‌ గౌడ్‌ పాలమూరు పర్యాటకంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పాలమూరు జిల్లా కేంద్రంలో అత్యంత సహజసిద్దమైన అర్బన్‌ పార్క్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద అర్బన్‌ పార్క్ అనే విషయాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు. పాలమూరు పర్యాటకానికి మణిహారంగా మయూరంగా పిలవబ డ్డ పార్క్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ చొరవతో అభివృద్ధి చెందడంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పాలమూరు కేసిఆర్‌ ఎకో అర్బన్‌ పార్కు ప్రసిద్ది గాంచిందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా భవిష్యత్తులో పర్యాటకంలో సిఎం కేసిఆర్‌ చొరవతో అగ్రగామిగా నిలుస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్ర రాజధాని నుండి ఈ పార్కును చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement