Saturday, November 23, 2024

దర్గాను దర్శించుకున్న మంత్రి..

మహబూబ్‌నగర్‌ : రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలు , మతాల వారి సమాన అభివృద్దికి కృషి చేస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని హజరత్‌ బాగ్మార్‌ సాబ్‌ దర్గా వద్ద రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను మంత్రి ప్రారంభించారు. అంతకుముందు మంత్రి దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని మతాలు , వర్గాల ప్రజలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తుందని , ప్రజలందరూ ఐక్యమత్యంతో జీవించాలని కోరారు. ప్రత్యేకించి మహబూబ్‌నగర్‌ జిల్లాలో దేవాలయాలు , మసీదులు , చర్చిల అభివృద్దికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తు వాటి అభివృద్దికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవలే మహబూబ్‌నగర్‌ నుంచి చించోలి వరకు నాలుగు లైన్ల రహదారి కూడా మంజూరు అయిందని , జిల్లాను పారిశ్రామికంగా కూడా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఈ సందర్బంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట మున్సిపల్‌ చైర్మన్‌ కె.సి. నర్సింహులు , వైస్‌ చైర్మన్‌ గణేష్ , జిల్లా రైతుబంధు అధ్యక్షుడు గోపాల్‌ యాదవ్‌ , గిరి , మైనార్టీ నాయకులు ఇంతియాజ్‌ అహ్మద్‌ , ఇఫ్తేకార్‌ అహ్మద్‌ , అన్వర్‌ భాష , జలీల్‌ , రషీద్‌ , తాకి , దర్గా పెద్దలు , మున్సిపల్‌ ఇంజనీర్‌ బెంజిమిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement