గద్వాల (ప్రతినిధి) మే 3 (ప్రభ న్యూస్) : నాగర్ కర్నూల్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో నిర్వహించే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అండ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు.
ఈనెల 5వ తేదీన జోగులాంబ గద్వాల జిల్లాకు ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరవుతున్న ఎర్రవల్లి చౌరస్తాలో సభాస్థలిని మంత్రి జూపల్లి కృష్ణారావు, జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరిత తిరుపతయ్య, వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి, మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ… మే 5న నడిగడ్డలో జరిగే లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభ విజయవంతం చేయుటకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు జన సమీకరణ చేయనున్నట్లు, తదితర అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.