పాలమూరు : జనగామ జిల్లా పాలకుర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర దివ్యాంగుల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక శిబిరాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ అర్హులైన దివ్యాంగులందరికీ ప్రభుత్వ లబ్ధి చేకూరేలా అన్ని చర్యలను సీఎం కేసిఆర్ నేతృత్వంలో ప్రభుత్వం తీసుకున్నదని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.అభివృద్ధిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా కొనసాగిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని, దేశంలో ఏకైక సీఎం కెసిఆర్ అని అన్నారు. కరోనా సమయంలో దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోద కాలు బాధితులు తదితరులకు ఇచ్చిన పెన్షన్లు వారికి ఎంతో ఊరట నిచ్చాయన్నారు. అదృష్టవశాత్తు సీఎం కేసిఆర్ ఆ శాఖను తనకే అప్పగించడం తన అదృష్టం అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 5లక్షల మంది దివ్యాంగులకు నెలకు రూ. 3016/- పెన్షన్స్ అంటే, ప్రతి నెలా రూ.150 కోట్లు, సంవత్సరానికి రూ.1800 కోట్లు ఒక్క ఆసరా పథకం ద్వారా దివ్యాంగుల కు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం, ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అన్నారు. ముఖ్యమంత్రి మనసున్న మహరాజు అని, ఆయన అందరి సంక్షేమం కోరుకుంటున్నారని చెప్పారు.దివ్యాంగుల బాధలు చూసి వారికి ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని 3,016కు పెంచిన ఘతన కూడా సీఎందే అన్నారు. అలాగే దివ్యాంగులకు ఇతరత్రా లబ్ధి చేకూర్చాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెం.1.గా ఉందన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్, ఆ సంస్థ చైర్మన్ డా.కె.వాసుదేవ రెడ్డి పని చేస్తున్నారని మంత్రి తెలిపారు
Advertisement
తాజా వార్తలు
Advertisement