Friday, November 22, 2024

MLC | మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక.. నేడే తేలనున్న ఫలితం

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గం ఉపఎన్నిక ఫలితం ఇవ్వాళే (ఆదివారం) తేలనుంది. జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కాలేజీలో ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ అయ్యింది. ఈ ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 28న ఉపఎన్నిక జరిగింది. కాంగ్రెస్‌ నుంచి మన్నె జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్‌ కుమార్‌ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌ గౌడ్‌ పోటీలో నిలిచారు.

- Advertisement -

కాగా, ఈ ఉపఎన్నికలో పోటీకి బీజేపీ దూరంగా ఉంది. నియోజకవర్గం పరిధిలో మొత్తం 1,439 మంది ఓటర్లుండగా 1,437 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిథిలోని ఇద్దరు ఎంపీటీసీలు మినహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెట్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో కౌంటింగ్‌ను ఈసీ ఇవాళ్టికి వాయిదా వేసింది.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మొదటి ఎన్నిక, సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎలాగైనా సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్, ఆ స్థానాన్ని చేజిక్కించుకోనాలని కాంగ్రెస్‌ గట్టి ప్రయత్నం చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement