Tuesday, November 26, 2024

MBNR: మహారాజ కూరగాయల మార్కెట్ కు పూర్వ వైభవం తీసుకొస్తాం..

కూరగాయల మార్కెట్ ను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్
గద్వాల (ప్రతినిధి) జూలై 22 (ప్రభ న్యూస్) : గద్వాల జిల్లా కేంద్రంలోని పాత కూరగాయల మార్కెట్ నిర్మాణంను ఇవాళ‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ పరిశీలించడం జరిగింది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గద్వాలలో రాజుల కాలంలో నాటి మహారాజ కూరగాయల మార్కెట్ గత పది సంవత్సరాల కిందట 2014 సంవత్సరంలో మార్కెట్ అధిక వర్షపాతంతో కూలిపోయింద‌ని, అప్పుడు ఈ ప్రమాదంలో 8మంది మృతి చెందార‌న్నారు. ఆ తర్వాత మున్సిపాలిటీ అధికారులు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయడం జరిగిందన్నారు.

సరైన రోడ్డు లేక డ్రైనేజీ నిర్మాణం సరిగ్గా లేక ప్రజలకు సౌకర్యంగా లేక నిర్మాణమైన షాపింగ్ కాంప్లెక్స్ వ్యాపారస్తులు ఎవరు కూడా దీనిని ఉపయోగించుకోలేక అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారింద‌న్నారు. వ్యాపారస్తులకు, ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, త్వరలో రెండు షాపులను కూల్చివేసి రోడ్డు వ్యవస్థను డ్రైనేజీ నిర్మాణం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కూరగాయల మార్కెట్ కు పాతరాజుల కాలం నాటి కూరగాయల మార్కెట్ నిర్మాణం చేసి పూర్వ వైభోగం వచ్చే విధంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు.

జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ మాట్లాడుతూ.. గద్వాల పట్టణంలోని ప్రజలకు అందుబాటులో ఉన్న కూరగాయల మార్కెట్లను ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరలో ఇంజనీరింగ్ అధికారులకు మార్కెట్ రోడ్డు నిర్మాణం డ్రైనేజీ నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో మార్కెట్లను నిర్మాణం చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో గద్వాల పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్స్ మురళి, షుకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రిజ్వాన్, అజయ్, సుదర్శన్, అన్వర్, పవన్ యాదవ్, విజయ్, బాలాజీ, నాయకులు, మున్సిపాలిటీ కమీషన్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement