రైతులు దళారుల చేతుల్లో మోసపోవద్దు..
రైతులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..
ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి ..
పెద్దకొత్తపల్లి : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం దండగా అన్న పదానికి నిలువెత్తు సాక్ష్యం వ్యవసాయమే పండుగగా తీర్చిదిద్దుతూ ఆయా ప్రాంతంలో రైతులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నెంబర్ వన్ స్థానంలో నిలిచారని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద చైర్మన్ బుడుగు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో.. కోడేర్ మండలంలోని నగులపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ( ఐకేపీ) ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. మండల పరిధిలోని మరికల్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్ ప్రారంభించారు. దేవల్ తిరుమలాపూర్ నక్కలపల్లి చంద్రకల్ గ్రామాలలో ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అనుక్షణం రైతులను ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని అన్నారు. రైతులు శ్రమించి పండించిన పంట దళారుల చేతుల్లో పెట్టి మోసపోకుండా ఉండేందుకు అదే.విధంగా ధాన్యాన్ని సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ దళారులు చెప్పే మాటలకు మోసపోకుండా మీ పరిసర ప్రాంతంలోనే వరి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం రైతులకు అనువుగా ఏర్పాటు చేసిందన్నారు. రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి సూచించారు. ఓవైపు కరోనాపై పోరాడుతూనే మరో వైపు రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు. అడుగడుగునా దళారుల బెడద నుండి రైతులను ఆదుకునేందుకే ముఖ్యమంత్రి వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. పంట కోసిన తర్వాత బాగా ఆరబెట్టుకొని 14 శాతం తేమ ఉండే విధంగా చూసుకోవాలని ధాన్యంలో తాల్ పొట్టు లేకుండా శుభ్రంగా చేసుకొని తర్వాత మీకు ఇచ్చిన టోకెన్ నెంబర్ ప్రకారంగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకు రావాలని రైతులను కోరారు. ధాన్యానికి మద్దతు ధర 1888 రెండవ ధర 1868 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు.. చంద్ర యాదవ్ ..గణేష్ రావు.. జగన్మోహన్ రెడ్డి.. వెంకటస్వామి.. సర్పంచులు కృష్ణవేణి.. రాధా నాగయ్య.. ఎంపీటీసీ ప్రతాపరెడ్డి.. మాజీ ఎంపీపీ వెంకటేశ్వరరావు.. వ్యవసాయ అధికారి రమేష్.. సీఈవో సిరాజ్.. డైరెక్టర్లు యాదగిరి వెంకటమ్మ.. నెంబర్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.