జోగులాంబ గద్వాల (ప్రతినిధి), ఆగస్టు 9 (ప్రభ న్యూస్): రైతుల కోసం అహర్నిషలు కృషి చేస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం రోజు గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల పరిధిలోని ప్రియదర్శిని జూరాలలో కుడికాలువకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి సాగునీరు విడుదల చేయడం జరిగినది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో పాలమూరు జిల్లా కరువు జిల్లాగానే కష్టాలను, కన్నీటిని దిగమింగుకుని ఇక్కడి జనం బతుకు జీవుడా అంటూ వలసలు వెళ్లేలా చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో పాలమూరు బిడ్డల తెగువ చూసిన సీఎం కేసీఆర్ మొదటి నుంచే ఈ జిల్లాపై ఎనలేని ప్రేమను చూపించారన్నారు. ఒకప్పటి వలసల జిల్లా పాలమూరు ఇప్పుడు అన్నపూర్ణగా మారిందన్నారు.
జూరాల ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేశామన్నారు. సాగునీటి అవసరాల కోసం రిజార్వయర్లను పూర్తి చేసి వ్యవసాయానికి పెద్ద పీట వేసిందన్నారు. సాగునీటిని అవసరాల కోసం కుడికాలువ ద్వారా నీటి విడుదల చేసినట్లు పేర్కొన్నారు. గద్వాల జిల్లా రైతాంగం 30వేల ఎకరాల నుండి 50 వేల ఎకరాల వరకు సాగునీరు రైతులకు పుష్కలంగా అందించడం జరుగుతుందన్నారు. డిసెంబర్ వరకు రైతులు పంటను పండించుకోవడానికి నీటిని విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి రైతులు నీటిని వృధా చేయకుండా క్రమ పద్ధతిలో వాడుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి పద్మా వెంకటేశ్వర రెడ్డి, రాజశేఖర్, ఎంపీపీ విజయ్, వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, ధరూర్ మండల పార్టీ అధ్యక్షుడు డి.ఆర్ విజయ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు ఈశ్వరయ్య, సర్పంచులు శివారెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, ఉపసర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రమేష్ నాయుడు, భగీరథ వంశీ, ఈశ్వర్, హనుమంత్ రెడ్డి, మునిరెడ్డి, నీటి పారుదల శాఖ అధికారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.