మహబూబ్ నగర్ క్రైమ్ : జోగులాంబ జోన్ – 7 డిఐజిగా ఎల్.ఎస్. చౌహన్ శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన డిఐజికి ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎస్పీలు, ఏఎస్పీలు,డీఎస్పీలు పోలీసు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఉమ్మడి జిల్లాలోని పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు.
అంతేకాక పోలీస్ వ్యవస్థను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఐదుగురు ఎస్పీలు, సిబ్బందితో కలిసి చర్చించి వారితో కలిసి పనిచేస్తూ జిల్లాల్లో, జోన్ లో పోలీస్ లు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకొని ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎస్.పి. ఆర్.వెంకటేశ్వర్లు , నాగర్కర్నూల్ ఎస్. పి మనోహర్, నారాయణపేట ఎస్. పి. ఎన్. వెంకటేశ్వలు, గద్వాల ఎస్. పి రంజాన్ రతన్ కుమార్, వివిధ జిల్లాల అదనపు ఎస్. పి లు, డీస్పీలు, ఇన్స్పెక్టర్లు, కార్యాలయ సిబ్బంది తదితరులు అధికారులు పాల్గొన్నారు.