Friday, October 18, 2024

MBNR: మహాత్మా జ్యోతిబాపూలే మహిళా డిగ్రీ కళాశాల ప్రారంభం

గద్వాల (ప్రతినిధి) జూలై 22 (ప్రభ న్యూస్) : గద్వాల నియోజకవర్గం, ధరూర్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే మహిళా డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ హాజరయ్యారు. మహాత్మ జ్యోతిబాపూలే మహిళా డిగ్రీ కళాశాలను ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… గతంలో గద్వాల ప్రాంతం విద్యారంగంలో వెనుకబడి ఉండేదని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిగా విద్యారంగ అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగిందన్నారు. గతంలో ఈ ప్రాంతంలోని విద్యారంగ అభివృద్ధి కోసం వివిధ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలలో ప్రతి మండలంలో ఇంటర్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా నర్సింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. వివిధ కోర్సులకు సంబంధించిన కళాశాలను కూడా గద్వాల ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు.

ధరూర్ మండల కేంద్రంగా గట్టు కే.టి దొడ్డి విద్యార్థులు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత పై చదువులకు గద్వాలకు వెళ్లి డిగ్రీ చదువుకోవాలనుకున్నా దూరం కావడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న యువతి కోసం ధరూర్ మండల కేంద్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళ అందుబాటులో ఉండే విధంగా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొదటి తరగతి 300 మంది విద్యార్థులతో త్వరలో తరగతులు ప్రారంభం జరుగుతుందన్నారు. ఇప్పటికి 180మంది విద్యార్థినీలు అడ్మిషన్ పొందడం జరిగిందన్నారు.

- Advertisement -

ఈ ప్రభుత్వంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో భవిష్యత్తులో గద్వాల ప్రాంతాల్లో మరింత విద్యారంగం అభివృద్ధి చేసే విధంగా తన వంతు కృషి చేస్తామని తెలిపారు. గద్వాల నియోజకవర్గంలో రాష్ట్రంలో కన్నా మరింత అభివృద్ధి చేసే విధంగా ముఖ్యంగా విద్య వైద్య ఇరిగేషన్ పైన అభివృద్ధి చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, రామకృష్ణ నాయుడు, కాంగ్రెస్ పార్టీ శ్రీనివాసరెడ్డి, సత్య రెడ్డి, డి.ఆర్ విజయ్, అజయ్, ఉరుకుందు, హనుమంతు, కురుమన్న, రఘువర్ధన్ రెడ్డి, డి.వై రామన్న, రాఘవేంద్ర రెడ్డి, శ్రీరాములు, రాఘవేంద్ర రెడ్డి, ఆనంద్ రెడ్డి, దేవన్న, సంజీవ్, ప్రవీణ్, ప్రిన్సిపల్, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement