హైదరాబాద్,ఆంధ్రప్రభ : మహబూబ్‌నగర్ జిల్లా వీఆర్‌లో ఉన్న ఎస్‌ఐ బాల వెంకట రమణను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదివారం ఐజీపీ సత్యనారాయణ ఆదేశాలిచ్చారు. ఈక్రమంలో 2021 నుంచి 2024 వరకు కొల్లాపూర్లో పనిచేసిన ఎస్‌ఐ బాల వెంకట రమణ 10 మందిపై 23 అక్రమ కేసులు నమెదు చేసినట్లు బాధితులు డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అంతేకాకుండా పిటిషనర్‌లను వేధించడం, వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. డీజీపీ, ఐజీపీల ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు ఎస్‌ఐపీ బాల వెంకట రమణ వేధింపులు నిజమేనని నివేదిక సమర్పించారు. దీంతో పోలీసుశాఖ ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరించిన ఎస్‌ఐపీ బాల వెంకట రమణను విధుల నుంచి తొలగిస్తూ ఐజీపీ ఆదేశాలిచ్చారు.