Saturday, July 6, 2024

MBNR: రాష్ట్రస్థాయి పోటీలకు మహబూబ్ నగర్ వేదిక కావడం సంతోషకరం… యెన్నం

మహబూబ్ నగర్, జులై 4 (ప్రభ న్యూస్) : యువతకు క్రీడలు క్రమశిక్షణ నేర్పిస్తాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా క్రీడా మైదానంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన 10వ అండర్ 19 తెలంగాణ బ్యాడ్మింట‌న్ చాంఫియన్ షిప్ 2024 పోటీల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహబూబ్ నగర్ పట్టణం రాష్ట్ర స్థాయి పోటీలకు వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా క్రీడలకు కేరాఫ్ గా నిలిచి, ఇక్కడి నుండి గొప్ప క్రీడాకారులను వెలికితీసి జాతికి పరిచయం చేయాలని ఆయన నిర్వాహకులకు సూచించారు. ఏ క్రీడలో అయినా రాణించాలంటే యువతకు క్రీడల మీద ఆసక్తి మాత్రమే కాదు, క్రమశిక్షణ కూడా ఎంతో ప్రధానమ‌ని ఎమ్మెల్యే చెప్పారు. క్రీడల్లో గెలుపు ఓటములు ముఖ్య కాదని, పాల్గొన్న ప్రతి క్రీడాకారుడు విజేతనే అని ఆయన తెలిపారు.

- Advertisement -

జిల్లా కేంద్రంలో మనకు మంచి ఇండోర్ స్టేడియం అందుబాటులో ఉందని, భవిష్యత్తులో అంంతర్ రాష్ట్ర టోర్నమెంట్, జాతీయ స్థాయిలో కూడా నిర్వహించే టోర్నమెంట్ లకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి సహాకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, డి. శ్యామ్ సుందర్ గౌడ్, రవి కుమార్, సాదుత్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement