Tuesday, November 26, 2024

గణపసముద్రం, బుద్దారం రిజర్వాయర్లకు గ్రీన్ సిగ్నల్

వనపర్తి/పెద్దమందడి: మార్చ్ 5 (ప్రభ న్యూస్) ; వనపర్తి జిల్లా పరిధిలోని గణప సముద్రం, బుద్దారం రిజర్వాయర్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఘనప సముద్రానికి రూ.55 కోట్లు, బుద్ధారం రిజర్వాయర్ కు రూ.42.2 కోట్లతో పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కృషి ఫలించి నట్లయ్యింది. 760 ఏళ్ల క్రితం కాకతీయుల కాలంలో గణపసబుద్రం నిర్మాణం చేశారు. గణపసముద్రం నిర్మాణాన్ని ఆదర్శంగా తీసుకుని వనపర్తి చుట్టూ సప్తసముద్రాలను వనపర్తి రాజులు నిర్మాణం చేశారు. తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ విలీనం తర్వాత పాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరుకున్న గణపసముద్రం, ఒకనాడు రైతులకు ఆసరాగా నిలిచిన గణపసముద్రం సమైక్య రాష్ట్రంలో కనీస మరమ్మతులకు నోచుకోలేదు.

నిరంజన్ రెడ్డి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి గణపసముద్రానికి మరమ్మతులు చేయించి కల్వకుర్తి ఎత్తిపోతల కాలువకు అనుసంధానం చేయించారు. 36 ఏళ్ల తర్వాత కృష్ణానది నీళ్లతో మండువేసవిలో గణప సముద్రం అలుగుపారించారు. గత ఐదేళ్లుగా గణపసముద్రం నిండుకుండలా ఉంటూ అలుగుపారుతున్నది. గణపసముద్రం రిజర్వాయర్ లో భూములు నష్టపోతున్న రైతుల సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు దాదాపు పదివేల ఎకరాలకు సాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. ప్రకృతి రమణీయంగా గణప సముద్రాన్ని తీర్చిదిద్దడంతో పాటు మరో 500 ఏళ్ల వరకు బహుళార్ధసాధకంగా ఉండడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. చరిత్రలో నిలిచిపోయే విధంగా ముందుకు సాగుతున్నారు. గణపసముద్రం పునరుద్దరణ పనులతో పాటు బుద్దారం రిజర్వాయర్ పనులు ఏకకాలంలో చేపట్టేవిధంగా ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేసింది. చరిత్రలో నిలిచిపోయే విధంగా గణపసముద్రం పునరుద్దరణ పనులతో పాటు బుద్దారం రిజర్వాయర్ పనులు ఏకకాలంలో చేపట్టేవిధంగా ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేసింది. గట్టుకాడిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి గణపసముద్రం కిరీటంలా, మకుటాయమానంలా నిలుస్తుంది. పనులు సకాలంలో పూర్తిచేసి సాగునీటిని రైతాంగానికి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement