Saturday, September 7, 2024

MBNR: చివరి ఆయకట్టు వరకు నీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే బండ్ల

గద్వాల (ప్రతినిధి) జులై 16 (ప్రభ న్యూస్) : గద్వాల నియోజకవర్గంలోని ధరూర్ మండలం పరిధిలో ర్యాలంపాడు రిజర్వాయర్ ద్వారా కుడికాలువకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి చేతుల మీదుగా ఇవాళ‌ కృష్ణమ్మ తల్లికి పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. ర్యాలంపాడు రిజర్వాయర్ నీళ్లు విడుదల చేసి ప్రారంభించి రైతులకు సకాలంలో నీటిని అందించారు.

రైతులు సమన్వయంతో నీటిని వృథా చేయకుండా వినియోగించుకోవాల‌ని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, వ్యవసాయానికి అన్నివిధాలుగా అండగా ఉంటుందన్నారు. ప్రస్తుతం వానకాలం కావడంతో రైతులు వ్యవసాయ పనులకు సిద్ధమాయ్యారని, కావున రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరైన సమయంలో నీటిని విడుదల చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రైతులకు రెండు పంటలకు చివరి ఆయకట్టు వరకు ప్రతి సన్నకారు రైతులకు సాగునీరు అందించాలనే ప్రభుత్వ లక్ష్యమ‌ని తెలిపారు. ఎగువ భాగంలో భారీ వర్షాలు కురుస్తుండటం వల్ల ఐదారు రోజుల్లో జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకుంటుందని, అనంతరం రిజర్వాయర్లు నింపుతామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి పటేల్ ప్రభాకర్ రెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ తిమ్మారెడ్డి, మాజీ ఎంపీపీ విజయ్, మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి రామకృష్ణ నాయుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యం రెడ్డి, విక్రమ్ సింహరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, డీ.ఆర్ విజయ్, భీమ్ రెడ్డి ప్రభాకర్ గౌడ్, డి.వై రామన్న, ఆనంద్ గౌడ, చంద్రశేఖర్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి విజయ్ రెడ్డి, నాగన్న, రంగస్వామి, కురుమన్న, రాఘవేంద్ర రెడ్డి, శ్రీరాములు, ఆనంద్ రెడ్డి, ఆలీ సురేష్, గోవిందు, ధర్మ నాయుడు, సవారన్న పురుషోత్తం రెడ్డి సంతోష్, పూడూరు చిన్నయ్య, రాజు, ఈ.ఈ రైముద్దీన్, నీటి పారుదల శాఖ అధికారులు, నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement