వీపనగండ్ల : ప్రభుత్వ ఆసుపత్రిలోనే మహిళలకు సురక్షితమైన కాన్పులు జరుగుతాయని వైద్యాధికారి డాక్టర్ శభానా తస్లిమ్ అన్నారు. ఆస్పత్రిలో సురక్షిత కాన్పు జరిగి ఇంటికి వెళ్తున్న మహిళకు కేసిఆర్ కిట్ ను స్టాఫ్ నర్స్ నిరీక్షణ అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు రోగులకు అందుతాయని.. మహిళలు ప్రసవాల కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి డబ్బులను వృధా చేసుకోవద్దని సూచించారు.గర్భం దాల్చిన మొదటి నెల నుంచి ప్రసవం వరకు ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకుంటే ఆమె పేరున ఆర్థిక సాయం కూడా అందుతుందని తెలిపారు.అంతేకాకుండా స్థానిక ఆసుపత్రిలో ట్యూబెక్టమీ,సీజైరిన్ ఆపరేషన్లు కూడా ప్రారంభించామని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement