జోగులాంబ గద్వాల : ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ కోట కింద 15వ వార్డుకు చెందిన శాలిమియాకు డబుల్ బెడ్ రూమ్ అలాట్ అయింది. ఇతని పేరు తొలగించి వేరొక పేరు చేర్చడంతో కలెక్టరేట్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఇది గమనించిన పోలీసులు పెట్రోల్ బాటిల్ లాక్కొని అతనిపై నీళ్లు పోశారు. నాకు న్యాయం జరగకపోతే నేను నా కుటుంబం ఆత్మహత్య చేసుకుంటామని డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుడు శాలిమియాకు అన్నారు. ఏప్రిల్ 15న పాత ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, రెవెన్యూ డివిజనల్ అధికారి, అదనపు కలెక్టర్, మున్సిపల్ చైర్మన్, ప్రజా ప్రతినిధులు అందరి సమక్షంలో 15వ వార్డుకు చెందిన ఫిజికల్ హ్యాండ్ క్యాప్డు కోటా కింద శాలిమియాకు డబల్ బెడ్ రూమ్ డిప్ ద్వారా ఎంపిక కావడం జరిగిందని తెలిపాడు.
అయితే నీ నంబర్ డిప్ లో లేదంటూ డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుడికి అధికారులు తెలపడంతో నాకు అలాట్ ఐన డబుల్ బెడ్ రూమ్ ఇతరులకు ఇచ్చారంటూ మనస్థాపానికి గురైన శాలిమియా కలెక్టరేట్ కార్యాలయం లోపలికి వెళ్లే గేటు దగ్గర పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేశాడు. ఇది గమనించిన పోలీసులు పెట్రోల్ బాటిల్ లాక్కొని అతనిపై నీళ్లు పోసి బయటకు తీసుకొచ్చారు. మాకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న బాధితుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.