Friday, November 22, 2024

TS: షాట్ సర్క్యూట్ తో వస్త్ర‌ దుకాణం దగ్దం… పరిశీలించిన ఎమ్మెల్యే

గద్వాల ప్రతినిధి, ఫిబ్రవరి 21 (ప్రభ న్యూస్): బుధవారం ఉద‌యం గద్వాల పట్టణ పరిధిలోని చిన్న అగ్రహారం దగ్గర ఓ ఇంటిలో బట్టల షాప్ లో షాట్ సర్క్యూట్‌తో దగ్దమైంది. రూ. 30 లక్షల వరకు సరుకులు మొత్తం కాలిపోయాయి. ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని విద్యుత్ ప్రమాదానికి గురైన షాపును పరిశీలించారు.

- Advertisement -

బట్టల షాప్ యజమాని చంద్రబాబుని పరామర్శించారు. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి నష్టపరిహారం వచ్చే విధంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంటనే జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడ్‌, ఎంపీపీ విజయ్, కౌన్సిలర్ శ్రీను, బిఆర్ఎస్ పార్టీ నాయకులు నరేందర్, రామాంజనేయులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement