Friday, October 4, 2024

MBNR: పురపాలక చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన గార్లపాటి శ్రీనివాసులు

అచ్చంపేట, జులై 6, ( ప్రభ న్యూస్) : అచ్చంపేట పురపాలక చైర్మన్ గా గార్లపాటి శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం అచ్చంపేట ఆర్డిఓ ఏ.మాధవి ఎన్నికల అధికారిగా మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను నిర్వహించారు. ఒకటవ వార్డు కౌన్సిలర్ గౌరీ శంకర్ పురపాలక చైర్మన్ గా గార్లపాటి శ్రీనివాసులును ప్రతిపాదించగా.. 14మంది కౌన్సిలర్లతో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ చేతులెత్తి బలపరచడంతో గార్లపాటి శ్రీనివాసులు పురపాలక సంఘ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఆర్డిఓ కే.మాధవి దృవీకరించి అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తో కలిసి గార్లపాటి శ్రీనివాసులకు అందజేశారు.

అనంతరం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ నూతనంగా ఎన్నికైన అచ్చంపేట మున్సిపాలిటీ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులును అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, ఆర్డీవో కార్యాలయం డిప్యూటీ తహసీల్దార్ నేనావత్ రాములు, 14మంది వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement