Wednesday, November 20, 2024

జూరాలకు వరద ఉధృతి.. 38 గేట్లు ఎత్తివేత

మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుకు 2.60 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 38 గేట్లు ఎత్తి 2.56 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు. ప్రస్తుతం 7.95 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 318.51 మీటర్లు కాగా, ప్రస్తుతం 317.51 మీటర్ల వద్ద నీరు ఉన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement