తెలంగాణలో రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గంలోని 211 గ్రామాలు 135 గ్రామ పంచాయతీలలో ఒక్క కాశీంనగర్కు మాత్రమే సాగు నీరు రాలేదన్నారు. మోటర్లు ఏర్పాటు చేసి గతంలో కొన్ని నీళ్లు తీసుకువచ్చాను. కానీ, అవి సరిపోవు. రామన్నగట్టు వద్ద రిజర్వాయర్ నిర్మించి అక్కడి నుండి కాశీంనగర్కు సాగు నీళ్లు తీసుకువస్తామని మంత్రి అన్నారు. 2005 వరకుకు పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు పట్టాలు అందిస్తాం అన్నారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు న్యాయం చేయాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement