Saturday, November 23, 2024

ప్రతి ఒక్కరూ మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలి : ఎమ్మెల్యే బండ్ల

జోగులాంబ గద్వాల : ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్య‌త‌గా ప్రతి మూడు నెలలకు ఒక‌సారి రక్తదానం చేయాలని గద్వాల్ శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ రోజు గద్వాల జిల్లా కేంద్రంలోని సీఎం కేసీఆర్ జన్మదినాని పురస్కరించుకొని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రెండవ రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గద్వాల్ ఎమ్మెల్యే ఆధ్వర్వంలో రక్తదాన శిభిరాన్ని ప్రారంభించారు. రక్తదాన కార్యక్రమంలో మొదట ఎమ్మెల్యే, ఎమ్మెల్యే సతీమణి రక్త దానం చేయడం జరిగినది. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యూత్ అధ్యక్షులు పెద్ద ఎత్తున దాదాపుగా 100 మందికి పైగా రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం తమ ప్రాణాలను లెక్కచేయకుండా ఆమరణ నిరాహార దీక్షలు చేసి తెలంగాణ సాధించిన నాయకుడు తెలంగాణ ఉద్యమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేసీఆర్ పాలనలో రైతులకు ప్రజలకు అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి, నేరుగా ప్రతి ఒక్క‌రికి ఈ పథకం అందే విధంగా కృషి చేస్తున్న‌ నాయకుడు కేసీఆర్ అని గర్వంగా చెప్పగలనన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బియస్ కేశవ్, ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య, జడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, మాజీ వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ కురుమన్న, అన్ని మండలాల ఎంపీపీలు జడ్పిటిసిలు, వైస్ చైర్మన్ లు, వైస్ ఎంపీపీ లు, కౌన్సిలర్స్ , సర్పంచులు, ఎంపీటీసీలు, అన్ని మండలాల టౌన్ పార్టీ ప్రెసిడెంట్ లు కార్యవర్గం, సింగల్ విండో డైరెక్టర్స్, ఆలయం కమిటీ డైరెక్టర్స్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్స్, అన్ని మండలాల, టౌన్ తెరాస పార్టీ యూత్ అధ్యక్షులు, కార్యవర్గం, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement