Saturday, November 23, 2024

తెలంగాణ‌లోనే ఉపాధి అవకాశాలు ఎక్కువ‌ : మంత్రి నిరంజన్ రెడ్డి

సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రంలోని గ్రామాలు నివాస యోగ్యంగా మారాయన్నాయ‌ని, ఉపాధి అవకాశాలు పెరిగితే ఊర్లు స్వయం సమృద్ధి సాధిస్తాయన్నార‌ని మంత్రి నిరంజ‌న్ రెడ్డి అన్నారు. పల్లె నిద్రలో భాగంగా వనపర్తి జిల్లాలోని రేవల్లి మండలం తల్పునూరులో ప్రజల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతున్నాయన్నారు. సాగునీటి వసతితోపాటు, 24 గంటల ఉచిత కరెంటు అందిస్తుండటంతో బీళ్లన్నీ పొలాలుగా మారుతున్నాయని, దీంతో గ్రామాల్లో దారులు సమస్యగా తయారయ్యాయని చెప్పారు. కాగా, తుల్పునూరుకు చెందిన రుక్మాకర్‌ రెడ్డిని మంత్రి అభినందించారు. 35 ఏండ్ల తర్వాత అమెరికా నుంచి స్వగ్రామానికి వచ్చిన రుక్మాకర్‌.. మేకలు పెంచుకోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. దళిత బంధులో కూడా ఇలాంటి యూనిట్లు అందిచవచ్చన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement