Saturday, November 23, 2024

ఎన్నికల్లో జడ్చర్ల రికార్డు బ్రేక్‌…

జడ్చర్ల : జడ్చర్ల ఈ నియోజకవర్గం పేరు వినగానే కొత్త రాష్ట్రానికి ఆరోగ్య మంత్రి అనే విషయం గుర్తు రావడం ఎంత సహజమో 11 ఏళ్లుగా పుర ఎన్నికలు , ప్రజా పాలన లేకుండా ఉన్న మున్సిపాలిటీ అని గుర్తు రావడం అంతే సహజం అంటున్నారు మేధావులు. ఇక్కడ గత రెండేళ్లుగా స్థానిక సంస్థలకు ఎంపిటిసిలు , మండలానికి ఎంపిపి లు లేక కేవలం అధికారుల పాలనతోనే నడుస్తున్న ఏకైక మండలం అని కూడా చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే కావేరమ్మపేట , బాదేపల్లి మేజర్‌ గ్రామపంచాయితీలను కలుపుతూ 2010 సంవత్సరంలో నగర పంచాయితీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది వ్యతిరేకిస్తూ కావేరమ్మపేట నాయకులు కోర్టును ఆశ్రయించారు. దాదాపు 5 ఏళ్ల తర్వాత 2015 లో కావేరమ్మపేట గ్రామ పంచాయితీ ఎన్నికలు జరిగాయి. కానీ బాదేపల్లి మాగ్రం ఎన్నికలు లేకుండా ఆగిపోయాయి. తిరిగి ప్రభుత్వం 2019 లో కావేరమ్మపేట , బాదేపల్లి లను కలుపుతూ జడ్చర్ల మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తే తిరిగి కొందరు కోర్టును ఆశ్రయించడంతో కథ మొదటికి వచ్చింది. కోర్టు రెండు మున్సిపాలిటీలు ఉంచాలా లేదా ప్రత్యేకంగా కొనసాగించాలా అనే నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్‌ కు ఇచ్చారు. ఇంకా కలెక్టర్‌ ఆదేశాలు పెండింగ్‌లోనే ఉండగా త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలి అంటూ ఎన్నికల కమిషన్‌ తెలపడంతో అధికారులు వార్డుల విభజన , ఓటరు జాబితాలను విడుదల చేశారు. ప్రస్తుతం అధికారులు ఓటరు జాబితాలో అభ్యంతరాలు చేపడుతున్నారు.
65 ఓట్లతో గ్రామ పంచాయితీ …
గిరిజనులు ఎన్నో ఏళ్లుగా ప్రత్యేక పంచాయితీల కోసం పోరాటం చేయగా తెలంగాణ ప్రభుత్వం కొత్త పంచాయితీలు ఏర్పాటు చేసింది. దీంతో మండల పరిధిలోని శంకరయ్యపల్లి , శంకరయ్యపల్లి తండాలను కలుపుతూ గ్రామ పంచాయితీ ఏర్పాటు చేశారు. కాగా కావేరమ్మపేట పంచాయితీ ఆవ్లొట్‌ గ్రామాలు కావడంతో అప్పట్లో బండమీదిపల్లి , శంకరాయపల్లి గ్రామాలకు ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు తిరిగి ఎన్నికలు నిర్వహిస్తుండగా అధికారులు ని ర్లక్ష్య ధోరణి తో శంకరాయపల్లి తండాలోని దాదాపు 175 ఓట్లు మున్సిపాలిటీ పరిశిలోకి రావడం తో కేవలం 65 ఓట్లతో శంకరాయపల్లి గ్రామానికి ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్దం అవుతున్నారు. గ్రామంలో 8 వార్డులను విభజించగా వార్డుకు కేవలం 8 ఓట్లు చేయడంతో ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారు. 2018 లో అధికారులు గ్రామాలను ఏర్పాటు చేసే క్రమంలో జడ్చర్ల పరిధిలోని సర్వే నెం. 371 ని విభజించకపోవడం గుడ్డిగా వదిలేయడంతోనే సమస్య అంటున్నా ఇక్కడ జడ్చర్లకు చెందిన కొందరు ప్రముఖుల భూములు ఉండటంతో వాటి విలువ పెంచుకునేందుకు మున్సిపాలిటీ లో కలిపారని తెలుస్తుంది.
రెవెన్యూ సర్వే ప్రకారం , ఎంపిడిఓ ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి
శంకరాయపల్లి గ్రామంలో కేవలం 60 ట్లు మాత్రమే ఉండటంతో వార్డుకు 8 ఓట్ల చొప్పున 8 వార్డులను విభజించడం జరిగింది. శంకరాయపల్లి తండా రెవెన్యూ సర్వే నెం.371 మున్సిపాలిటీ పరిధిలోకి రావడంతో అది మున్సిపల్‌ పరిధిలోకి వెళ్లింది. కాగా ఇక్కడ ఎస్టి మహిళ సర్పంచ్‌ రిజర్వేషన్‌ రావడం ఒక్కరు కూడా ఎస్టిలు శంకరాయపల్లి లో లేకపోవడంతో కేవలం వార్డు సభ్యులకు మాత్రమే నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఓటరు జాబితా అభ్యంతరం తీసుకుంటున్నాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement