Saturday, November 23, 2024

ఎద్దుల బండలాగుడు పోటీలు..

గద్వాల : నియోజకవర్గంలో గద్వాల మండలం పరిధిలో శెట్టి ఆత్మకూర్ గ్రామంలో శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా రైతు సంబరాలు.. ఎద్దుల బండలాగు పోటీలను ప్రారంభించారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి. అనతంరం సర్పంచ్ ఎమ్మెల్యేకి శాలువా కప్పి.. పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గద్వాల ప్రజలందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా కష్టకాలంలో దేశం యావత్తు బంద్ అయినా వ్యవసాయం మాత్రం ఆగకుండా కొనసాగిందని అన్నారు. దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతు పరబ్రహ్మగా మంత్రి అభివర్ణించారు.రైతు లేనిదే ఈ ప్రపంచం లేదని….రైతే ఎజెండాగా పని చేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్ర అని తెలిపారు.పోటీలో గెలుపు ఓటమి సహజమే అని నిరుత్సాహ పడకండి ఓటమి విజయానికి నాంది అని అన్నారు.శ్రీ రామ ఆశీస్సులతో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అంతం కావాలని కోరారు.
అన్ని వర్గాల ప్రజలకు, రైతులకు, వ్యవసాయ రంగంలో.. పాడి పరిశ్రమల రంగంలో.. వ్యాపారస్తులకు విద్యావంతులకు అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సుఖంగా జీవించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో‌ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య, మున్సిపల్ చైర్మన్ బియస్ కేశవ్ ఎంపీపీ ప్రతాప్ గౌడ్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సంజీవులు, సర్పంచ్ శివమణి, ఎంపీటీసీ తెరాస మండల పార్టీ అధ్యక్షులు రమేష్ నాయుడు తెరాస నాయకులు కార్యకర్తలు, రైతులు యూత్ సభ్యులు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement