పెద్దకొత్తపల్లి : నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలో కుక్కల దాడిలో చుక్కల దుప్పి మృతి చెందింది. సమీప అటవీ ప్రాంతంలో కుక్కలు చుక్కల దుప్పిపై దాడి చేస్తూ వెంబడించాయి. మృతి చెందిన దుప్పి సమాచారం సమీప పొలాల రైతులు అటవీ అధికారులకు అందించడంతో సంఘటనా స్థలం వద్ద కు లింగాల ఫారెస్ట్ రేంజర్ వికాస్ డిప్యూటీ రేంజర్ రమేష్, బీట్ ఆఫీసర్ నాగార్జున గౌడ్, స్థానిక ఎస్సై నాగన్న లు చేరుకొని ఘటనా స్థలం వద్దకి చేరి మృతి చెందిన చుక్కల దుప్పిని పరిశీలించారు. అనంతరం లింగాల ఫారెస్టు రేంజర్ వికాస్ ఆదేశాల మేరకు పశువైద్య కేంద్రంలో దుప్పికి పశువైద్యాధికారుల చేత శవపరీక్ష నిర్వహించామని అటవీ ప్రాంతంలోని చుక్కల దుప్పి ని కుక్కలు వెంబడించి దాడిచేసి చంపినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారని తెలిపారు. ఇదిలా ఉండగా దుప్పి మెడపై కుక్కలు దాడిచేశాయని . దుప్పి 8 ఏళ్ల వయస్సు కలిగి ఉంటుందని లింగాల రేంజర్ వికాస్ తెలిపారు. దుప్పి కాలుకు తీవ్ర గాయం ఉండటంతోనే పరుగెత్త లేక పోయిందని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యమే అటవీ వన్యప్రాణులకు శాపంగా మారుతున్నాయని పలువురిలో అనుమానాలు చోటుచేసు కుంటూనే ఉన్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement