మహబూబ్‌నగర్ : డబుల్ బెడ్‌రూం ఇండ్లు నాణ్యతగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. జిల్లాలో చేపట్టిన డబల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు , కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం ఏనుగొండ సమీపంలో జర్నలిస్టు కాలనీలో నిర్మిస్తున్న డబల్ బెడ్‌రూం ఇండ్ల పురోగతిని తనిఖీ చేశారు. కొత్తగా నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్లలో నూతన సాంకేతికతను వినియోగించాలని ఇంజనీరింగ్ అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జర్నలిస్టు కాలనీలో నిర్మిస్తున్న మొత్తం డబుల్ బెడ్‌రూం ఇండ్ల సంఖ్య , బేస్‌మెంట్ , ఇంటి బెడ్‌రూంలు , కిచెన్ తదితర కొలతలను అడిగి తెలుసుకున్నారు. జర్నలిస్టు కాలనీలో నిర్మిస్తున్న ఇండ్లు నాణ్యతగా ఉండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్ గౌడ్ ఆదేశించిన మేరకు ప్రత్యేకించి డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించే చోట షాప్ నిర్మాణాలు కూడా చేపట్టాలని ఆయన ఆదేశించారు. మున్సిపల్ అధికారులు సహకారంతో ఆయా కాలనీల వద్ద కనీస సౌకర్యాలు కల్పించే షాపింగ్ ఏర్పాటు చేయాలని , అందరికి సరిపోయే విధంగా అనుకూలంగా ఉండేలా ఏర్పాటు చేసేందుకు నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో అన్ని చోట్ల డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో పూర్తి నాణ్యత ఉండాలని , నాణ్యత లోపిస్తే ఊరుకునేది లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గృహనిర్మాణ వాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వైద్యం భాస్కర్ , ఇతర ఇంజనీరింగ్ అధికారులు , కాంట్రాక్టర్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement