Saturday, November 23, 2024

దివ్యాంగులకు చేయూతగా తెలంగాణ ప్రభుత్వం..

గద్వాల : దేశంలో ఎక్కడ లేని విధంగా దివ్యాంగులకు పించన్లు, వారి అవసరాలకై వివిధ అధునాతన ఉపకరణాలను అందిస్తున్న ఎకైన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి అన్నారు. గద్వాల పట్టణంలోని కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో దివ్యాంగులకు పలు ఉపకరణాలను పంపిణి చేశారు. వితరణ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి పాల్గొన్నారు. వికాలాంగుల కొరకు మూడు చక్రాల స్కూటీలు (జూపీటుర్), స్పైనల్ కాట్ ఇంజూరి (మస్కిలర్ డిస్ర్టోపి) ఉన్నవారికి బ్యాటరి ఆధారిత వీల్ చైర్, బ్యాటరి ఆపరేటర్ ట్రైసైకిల్, వినికిడి లోపం ఉండి చదువుకునే విద్యార్థులకు, అంధ విద్యార్థులకు ల్యాప్ టాప్, వినికిడి లోపం ఉన్న వారికి పరికరాలు అందించారు. రిట్రోపైడ్ వాహనాలు, బ్యాటరి ఆధారిత వీల్ చైర్లు, ల్యాప్ టాప్ లను అందించారు.500 గా ఉన్న వికలాంగుల పెన్షన్ 1500 వందలు పెంచారని, ఆతరువాత 3000 పెంచిన రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమేనని అన్నారు. అంతేకాకుండా వికలాంగుల కొరకు అధునాతమైన పరికరాలు అందించామన్నారు. స్పింగ్ మోడల్ చంక కర్రలు 3వేల రూపాయలను వెచ్చించి అందించామన్నారు. అంధుల కొరకు 2మీటర్ల ముందు తెలియజేసే విధంగాఉండే చెతికర్రను అదించామన్నారు. బ్యాటరి ఆధారిత మూడుచక్రాల ట్రైసైకిల్ లను 46 మంది దివ్యాంగులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బియస్ కేశవ్, జెడ్ పి టి సి రాజశేఖర్ వైస్ చైర్మన్ బాబర్ జిల్లా విద్యాధికారి , కౌన్సిలర్ కృష్ణ, నాగిరెడ్డి నరహరి గౌడ్, శ్రీను, మహేష్, తెరాస నాయకులు కోటీష్ సాయి శ్యామ్ రెడ్డి, రంజిత్ ధర్మ నాయుడు, పవన్, వీరేష్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement