Tuesday, November 26, 2024

పేట సబ్ జైల్ ను పరిశీలించిన జైళ్ల శాఖ డిఐజి

నారాయణపేట, ఫిబ్రవరి 25 (ప్రభ న్యూస్) : నారాయణపేట జిల్లా కేంద్రంలోని కోర్టు భవన సముదాయం పక్కన శిథిలావస్థకు చేరిన సబ్ జైలును సోమవారం హైదరాబాద్ రేంజ్ జైళ్ల శాఖ డిఐజి ఎన్ మురళి బాబు పరిశీలించారు. ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించిన సబ్ జైలు నిరుపయోగంగా మారి పూర్తిగా శిథిలావసకు చేరింది. జైళ్ల శాఖ డిఐజి మురళి బాబు సబ్ జైల్లోని అన్ని గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. సబ్ జైల్ పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో పాటు ముళ్లపొదలతో నిండి ఉండడంతో వాటి మధ్యే తిరుగుతూ డీఐజీ సబ్ జైల్ పరిసరాలు మొత్తం పరిశీలించారు.

అనంతరం డిఐజి మురళి బాబు మాట్లాడుతూ… శిథిలావస్థలో ఉన్న సబ్ జైల్ స్థలంలో నూతనంగా పెట్రోల్ బంక్ ఏర్పాటు గురించి పరిశీలించడం జరిగిందని తెలిపారు. జిల్లా ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లుతోనూ నూతన పెట్రోల్ బంక్ ఏర్పాటు గురించి చర్చించడం జరిగిందన్నారు. ఆ సబ్ జైల్ స్థలంలో త్వరలో కొత్తగా పెట్రోల్ బంకును ఏర్పాటు చేసి అందులో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు ఉపాధి కల్పించనున్నట్లు డిఐజి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిఐజితో పాటు జిల్లా సబ్ జైలర్ డి.ఎస్.పి వెంకటేష్, నారాయణపేట సీఐ రవిబాబు, ఎస్సై సురేష్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement