Friday, November 22, 2024

జడ్చర్ల జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో హరితహారం.. పాల్గొన్న డీఐజీచౌహాన్

సమృద్ధిగా వానలు కురవాలంటే అడవులను రక్షించి చెట్లను పెంచి పచ్చదనాన్ని కాపాడాలని అందుకుగాను ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని డిఐజి. ఎల్ఎస్ చౌహన్ అన్నారు. హరితహారంలో భాగంగా ఇవ్వాల (శుక్రవారం) జడ్చర్లలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూభాగంలో 33% శాతం పచ్చదనం ఉంటేనే వాతావరణ సమతుల్యం సాధ్యం అవుతుందని, పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో అడవులు కరిగిపోతున్నాయని దీనివల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయన్నారు.

- Advertisement -

vఅందుకే వర్షపాతం తగ్గడమే కాకుండా వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందని, మానవ జీవితమే అల్లకోలలం అవుతుందని, ఈ పరిస్థితులలో మార్పు తేవడానికి పెద్ద ఎత్తున ముక్కలు నాటాలని అన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి విధిగా మొక్కలు నాటాలని ఆయన సూచించారు. జడ్చర్ల లోని జిల్లా శిక్షణ కేంద్రంలో 540 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ కె.నరసింహ, అదనపు ఎస్పీ రాములు, ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డి.ఎస్.పి లు మహేష్, రమణారెడ్డి, శ్రీనివాసులు సిఐ, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement