Wednesday, November 20, 2024

అస్సాం సీఎంపై చర్యలు తీసుకోవాలని ధర్నా: కాంగ్రెస్ నేతల అరెస్ట్

జోగులాంబ గద్వాల : కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ పై చర్యలు తీసుకోవాలని ఏఐసిసి కార్యదర్శి డిమాండ్ చేశారు. జోగులంబ గద్వాల జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ కార్యాలయం గేటు ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ నిరసన చేపట్టి మీడియాతో మాట్లాడుతూ… అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ యూపీఏ అధ్యక్షురాలు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్యగా భావిస్తూ ఇలాంటి నాయకులు మన దేశాన్ని ఏలడం సిగ్గుచేటని పార్టీ నాయకులపై మండిపడ్డారు. భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని, లేనిపక్షంలో బీజేపీ పార్టీకి పుట్టగతులు ఉండవంటూ పార్టీ నాయకకులపై విమర్శనాస్త్రాలు సంధించారు.

కార్యక్రమంలో అలంపూర్ మాజీ శాసన సభ్యులు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తో పాటు కాంగ్రెస్ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్ యుఐ అధ్యక్షుడు వెంకటేశ్, నాయకులున్నారు. ఎస్పీ కార్యాల‌య స‌మీపంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement