కనువిందు చేస్తున్న జలపాతాలు
ఒక్కరోజే వెయ్యి మందికి అన్నదానం
కందూరు సుధాకర్
అచ్చంపేట జూన్ 7, ప్రభ న్యూస్ : ప్రముఖ శైవ క్షేత్రం, శ్రీశైలం ఉత్తర ద్వారంగా విరాజిల్లుతున్న ఉమామహేశ్వరానికి శుక్రవారం భక్తులు, పర్యాటకులు పోటెత్తారని ఆలయ ఛైర్మన్ కందూర్ సుధాకర్ తెలిపారు. గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దేవస్థానం కొండలపై నుండి చెట్ల మధ్యల నుండి జలపాతాలు జాలువారుతుండటంతో చూడటానికి భక్తులు, పర్యాటకుల రద్దీ ఉమామహేశ్వరానికి పెరిగిందని తెలిపారు.
ఇక్కడి ప్రకృతి రమణీయత, జాలువారే జలపాతాలతో భక్తులు పరవశించిపోయారని, జలపాతాల క్రింద పెద్ద, చిన్న తేడా లేకుండా స్నానాలు చేస్తూ కేరింతలతో మైమరచిపోయారని తెలిపారు. క్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ దాదాపు వెయ్యి మందికి ఓపికగా అన్నదానం చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
- Advertisement -