మక్తల్,ఫిబ్రవరి01(ప్రభన్యూస్): భీమా ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన సంగంబండ రిజర్వాయర్ ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచందర్ రెడ్డి అన్నారు. ఇవాళ ఉదయం స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తోకలిసి సంగంబండ రిజర్వాయర్ ను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి సంగంబండ రిజర్వార్ ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పారుస్తామని చెప్పారు. రిజర్వాయర్ వద్ద అభివృద్ధి పనులు చేపట్టి హరిత హోటల్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే అవకాశం ఉన్నా గత పాలకులు పట్టించుకోలేదన్నారు. పచ్చని చెట్లు,సహజసిద్ధమైన కొండలు, రిజర్వాయర్ ఆనకట్ట కింద నీరు పారే పెద్దవాగు వంటి అహ్లాదకరమైన వాతావరణం ఉందని ఇక్కడ హరిత హోటల్ ఇతర అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు అహల్లాదాన్ని పంచేందుకు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ముఖ్యమంత్రిని కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని చల్లా వంశీచందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జి.లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రకాంత్ గౌడ్, మాజీ సర్పంచ్ చందాపూర్ రాములు ,మామిళ్ళ ఆంజనేయులు ,పారేవుల విష్ణువర్ధన్ రెడ్డి ,కృష్ణారెడ్డి తదితరులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్ద పీట..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచందర్ రెడ్డి అన్నారు. పాలమూరు పార్లమెంట్ పరిధిలో చేపట్టిన పాలమూరు న్యాయయాత్ర పాదయాత్ర గురువారం ఊట్కూరు మండలంలో పెద్ద చట్టం గ్రామం నుండి స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి ప్రారంభించారు. పాదయాత్ర అవుసలోని పల్లి మీదుగా బిజ్వార్, పులిమామిడి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఇవాళ మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పాలమూరు ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాలకు సాగునీరు అందించే 69 జీఓ అమలు చేసి సాగునీరు అందిస్తామని చెప్పారు. ఈ పాదయాత్రలో స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ,జెడ్పి చైర్పర్సన్ కే.వనజ ఆంజనేయులు గౌడ్ ,డిసిసి అధ్యక్షుడు కె.ప్రశాంత్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గవినోళ్ళ బాలకృష్ణ రెడ్డి ,జి. గోపాల్ రెడ్డి, పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి,జి.రవికుమార్ యాదవ్, బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి ,ఎల్కోటి నారాయణరెడ్డి,మణెమ్మ ,మోహన్ రెడ్డి, సూరయ్య గౌడ్, విఘ్నేశ్వర్ రెడ్డి ,కావాలి తాయప్ప తదితరులు పాల్గొన్నారు.