నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డీఈవో గోవిందరాజులు పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని కల్వకుర్తి మండలంలోని తాండ్ర ఉన్నత పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థుల అస్వస్థతకు గురైన సంఘటనపై శుక్రవారం పౌరసరఫరాల జిల్లా మేనేజర్ బాలరాజ్ తో కలిసి జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు విచారణ జరిపారు. మండల విద్యాధికారి, ఎంపీడీవో, గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పాఠశాల పరిసరాలను, తాగునీరు, మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. వంట ఏజెన్సీలను, పాఠశాల హెచ్ఎంను విచారించారు. పాఠశాలలకు వచ్చిన నూతన బియ్యాన్ని పరిశీలించి శాంపిల్ ను సేకరించారు. మధ్యాహ్న భోజనంకు సంబంధించిన బియ్యం, కందిపప్పు, పరిశీలించి శాంపిల్ సేకరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement