Friday, September 6, 2024

MBNR: కేసీఆర్‌ చౌకబారు విమర్శలు మానుకోవాలి.. ఎమ్మెల్యే వంశీకృష్ణ

7 లక్షల 71 వేల కోట్ల అప్పుతో తెలంగాణను అధోగతి పట్టించిన కేసీఆర్‌
ప్రజలను వంచించి మొండిచేయి చూపిన మాజీ సీఎం కేసీఆర్‌
కేసీఆర్‌ హామీల అమలుపై సవాల్‌ విసిరిన ఎమ్మేల్యే వంశీకృష్ణ
అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
ఒకేసారి లక్ష ఉద్యోగాలు, ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌
అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ

అచ్చంపేట, జులై 26, ప్రభ న్యూస్ : తెలంగాణ ప్రజల్ని మాయ మాటలతో వంచించి వారికి మొండిచేయి చూపిన కేసీఆర్‌ నేటి బడ్జెట్‌ను ఒట్టి గ్యాస్‌, ట్రాస్‌ అని ఎద్దేవా చేయడం తగదని అచ్చంపేట ఎమ్మేల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం అచ్చంపేట పట్టణంలోని బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రజా భవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన విమర్శలపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్‌ సి.వంశీకృష్ణ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఆర్థిక శాఖమంత్రి భ‌ట్టి విక్రమార్క, తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ అన్నదాతలకు ఆలంబనగా నిలుస్తూ ప్రజాప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ నూటికి నూరు శాతం రైతు పక్షపాత బడ్జెట్‌ అని, 2 లక్షల 91 వేల 159 వందల కోట్లతో ప్రవేశపెట్టిన 2024 వార్షిక బడ్జెట్‌లో రైతాంగానికి 47.8 శాతం అనగా 72వేల 659 కోట్లు కేటాయిస్తూ రైతులకు పెద్దపీట వేయడం జరిగిందన్నారు.

విద్య, వైద్యం, నీటి పారుదల, పరిశ్రమలు, శిశు సంక్షేమానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిస్తూ ఎస్సీ, ఎస్టీ, బిసి లాంటి అన్ని రంగాలను, అన్ని వర్గాలను సమతుల్యం చేస్తూ బడ్జెట్‌ను కాంగ్రేసు పార్టీ నిరుపేదల ప్రభుత్వమ‌ని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనమేమి కావాల‌న్నారు. జై జవాన్‌, జై కిషాన్‌ నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సార్థకతం చేశారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణాలో వాటిని నెరవేర్చేందుకు నల్లమల ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కృషి చేస్తున్నారని, ఒకేసారి లక్ష ఉద్యోగాలు ఇచ్చి ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేసేందుకు ప్రత్యేక శ్రద్ద పెట్టారన్నారు. మాజీ ముఖ్యమంత్రి తన 10 సంవత్సరాల తన పాలనలో తాను ఇచ్చిన హామీలైన రుణమాఫీ, దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, నిరుపేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు, ఇంటికో ఉద్యోగం అంటూ 108 అబద్దాలు ఆడింది నిజం కాదా అని, ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చినట్లు నిరూపించగలరా అంటూ సవాల్‌ విసిరారు.

కాంగ్రెస్ పార్టీ 1993 సంవత్సరంలోనే నాటి ఉమ్మడి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి హ‌యాంలోనే 69 కోట్ల రూపాయలతో ఎన్డీసీపీ పథకంలో గొర్ల స్కీంను ప్రవేశ పెట్టిందన్నారు. కేసీఆర్‌ తన 10 సంవత్సరాల కాలంలో మాయ మాటలతో వంచించి 7 లక్షల 71 వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి రైతాంగానికి ఏమి చేయకుండానే తెలంగాణను ఆధోగతి పట్టించారని మండిపడ్డారు. నాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన శ్రీశైలం, నాగార్జున సాగర్‌, లాంటి భారీ ప్రాజెక్టులు నిర్మించి 70 సంవత్సరాలు దాటినా చెక్కు చెదరకుండా వున్నాయని, కానీ కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రగల్భాలు పలికారని, కాళేశ్వరం నేడు కృంగిపోయిందని, గుండ్ల పోచమ్మ తెగిపోయిందని, కల్వకుర్తి లిప్ట్‌ పంపులు మునిగిపోయాయని, నాడు వైఎస్సార్ హ‌యాంలో చేపట్టిన కాలువల్లోనే నేడు నీరు పారుతుందని, కేసీఆర్‌ చేసిందేమీ లేదని, ఒక్క ఎకరానికి కూడా సాగునీరివ్వలేదని ఎద్దేవా చేశారు. ప్రజలు బుద్ది చెప్పినా కేసీఆర్‌ తీరు మారలేదని, హరీశ్‌రావు హుందాతనాన్ని పాటించాలని, నిజాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా ఆచరణాత్మక సలహాలు, సూచనలిస్తే తీసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్దంగా వున్నారన్నారు.

- Advertisement -

వార్షిక బడ్జెట్‌లో సాగు నీటికి ప్రాధాన్యత..
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లోని నిధులతో అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టును పర్యాటక రంగంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. సాగునీటి రంగానికి ప్రాధాన్యతలో భాగంగా కల్వకుర్తి లిఫ్ట్‌, కెనాల్‌, అచ్చంపేట ఉమామహేశ్వర లిఫ్ట్‌ పథకానికి 500 కోట్లు కేటాయించడం జరిగిందని, నియోజకవర్గానికి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను మంజూరి చేసినట్లు ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement