పెద్దకొత్తపల్లి : మండల పరిధిలోని దేవల్ తిరుమలాపూర్ గ్రామంలో కోవిడ్ నియంత్రణలో భాగంగా గ్రామంలో గ్రామ సర్పంచ్ సత్యం ఆధ్వర్యంలో బ్లీచింగ్ పౌడర్ ను వీధులలో గ్రామమంతా చల్లారు. రెండో విడత కోవిడ్ ఎక్కువగా ఉండటంతో ముందు జాగ్రత్తగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలో ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందని గ్రామ సర్పంచ్ సత్యం తెలిపారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి బయటకు వెళ్లాలని గుంపులు గుంపులుగా ఉండరాదని.. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. గ్రామంలో కోవిడ్ కి తావివ్వకుండా మన గ్రామాన్ని మనమే రక్షించుకొని.. మిగతా గ్రామాలను కూడా రక్షించేందుకు తోడ్పాటుగా ఉందామని గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ శ్రీనివాసులు యాదవ్.. గ్రామ కార్యదర్శి మల్లికార్జున్.. గ్రామ పంచాయతీ ..వార్డు మెంబర్లు.. గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement