జోగులాంబ గద్వాల జిల్లాలో కల్తీ లిక్కర్ రాకెట్ ముఠాను గద్వాల ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. 35 లీటర్ల క్యాన్లు 5, ఇంపీరియల్ బ్లూ 85 బాటిళ్లు స్వాధీన పరచుకొని, వీటితో పాటు ఒక ఎర్టిగా కారు, రెండు మోటర్ బైకులు స్వాధీన పరుచుకున్నారు. కల్తీ లిక్కర్ ముఠాలో ఎనిమిది మందిని గద్వాల ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లాలో కె.టి.దొడ్డి మండలం, పాతపాలెం గ్రామంలో కల్తీ లిక్కర్ రాకెట్ తయారు చేసే ముఠాను అరెస్ట్ చేశారు.
ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని 35 లీటర్ల క్యాన్లు 5, ఇంపీరియల్ బ్లూ 85 బాటిల్ ను, ఒక కారు రెండు బైకులు స్వాధీన పరుచుకున్నట్లు గద్వాల ఎక్సైజ్ అధికారులు విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ కల్తీ లిక్కర్ తయారు చేసిన వాటిని రాష్ట్రాల బార్డర్ లో అమ్ముతున్నట్లు, బెల్ట్ షాపుల్లో అమ్ముతున్నట్లు ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ అధికారి దత్తు రాజు గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరిండెంట్ సైదులు, గద్వాల సీఐ గోపాల్, అల్లంపూర్ సి.ఐ తో పాటు జోగులాంబ గద్వాల జిల్లా మండలాల సబ్ ఇన్ స్పెక్టర్లు, సిబ్బంది ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital