వీపనగండ్ల : మండల పరిధిలోని పుల్గర్ చర్ల గ్రామంలో కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తూ ఉండటం వల్ల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ అరుణమ్మ, ఉప సర్పంచ్ బిజ్జ నరేష్ కుమార్ తెలిపారు. గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ ను చల్లించారు. గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి భౌతిక దూరం, జాగ్రత్తలు పాటిస్తూ శానిటేషన్ వాడాలని సూచించారు. ప్రజలు నిర్లక్ష్యం విడకపోతే కరోనా మహమ్మారి బారిన పడాల్సి వస్తుందని అన్నారు. అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు. దగ్గు ..జ్వరం వంటి లక్షణాలు కలిగి ఉంటే వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. గ్రామంలో 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కరోనా నివారణ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు ,డ్రైవర్ కురుమయ్య,వాటర్ మెన్ ఆంజనేయులు,బాలస్వామి, వీ అర్ ఏ లు బిజ్జ పరమేష్ , మోగులాలి, వెంకటేష్,ఏ ఎన్ ఎం రేణుక గ్రామ యువకులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement