Saturday, October 5, 2024

MBNR: నకిలీ విత్తనాల నిర్మూలనకు సహకరించండి… ఆర్డీఓ

అచ్చంపేట, జూన్ 1 (ప్రభ న్యూస్‌) : ఫ‌ర్టిలైజర్‌ డీలర్లు నిబంధనలను ఉల్లంఘించరాదని, నకిలీ విత్తనాలు, కాలం చెల్లిన విత్తనాలు దుకాణాల్లో కలిగి ఉండరాదని, విక్రయించరాదని అచ్చంపేట ఆర్డీఓ కే.మాధవి స్పష్టం చేశారు. శనివారం అచ్చంపేట పట్టణంలోని సంతోష్‌ ట్రేడర్స్‌, ఓం సాయిరాం ట్రేడర్స్‌లను అచ్చంపేట మండల వ్యవసాయాధికారి కృష్ణయ్యతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను, ఎరువుల షాపులలోని విత్తనాలు, ఫర్టిలైజర్స్‌లను నిశితంగా తనిఖీ చేసి ఎరువులను, విత్తనాలను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, నిబంధనలను ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు.

అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. రైతులకు ప్రభుత్వం ఆమోదించిన నాణ్యమైన విత్తనాలను వ్యవసాయ శాఖ వారి గుర్తింపు పొందిన డీలర్లకు అందుబాటులో వుంచారని, వాటిని మాత్రమే రైతులు కొనుగోలు చేసి తమ పంటలను కాపాడుకోవాలని సూచించారు. రైతులు తాము కొన్ని విత్తనాలకు, ఫెస్టిసైడ్స్‌కు డీలర్‌ నుండి ఖచ్చితంగా రశీదు తీసుకొని, కొనుగోలు చేసిన విత్తనాలు, ఎరువుల సంచులను భద్రపరచుకోవాలని సూచించారు.

- Advertisement -

గ్రామాల్లో వచ్చే అపరిచితులను నమ్మరాదని, వారి వద్ద నుండి ఎలాంటి విత్తనాలు కొనుగొలు చేయరాదని, అట్టి వారి వివరాలను వ్యవసాయ శాఖ, పోలీసు వారికి తెలుపాలని సూచించారు.. నకిలీ విత్తనాలను అరికట్టుటకై మండల స్థాయిలో త‌హ‌సీల్దార్, మండల వ్యవసాయ అధికారి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ వ్యవసాయ శాఖ ఏడీ, సీఐ లేదా డీఎస్పీ టీములతో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement