Friday, November 22, 2024

గద్వాలలో కలుషిత నీటి కలకలం.. 50 మందికి అస్వస్థత..

జోగులాంబ గద్వాల (ప్రతినిధి) : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గత ఐదు రోజుల కిందట కురిసిన భారీ వర్షానికి, గత రెండు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షాలకి గద్వాల పురపాలక సంఘ పరిధిలోని కొన్ని కాలనీలలో నీరు కలుషితం కావడంతో ఆ కలుషిత నీరు తాగిన కాలనీవాసులు అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. వేదనగర్, గంటగేరి, మోమిన్ మహాళ్ల, ధరూర్ మెట్టు ప్రాంతాల్లో కొద్దిరోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతున్నట్లు చెబుతున్నారు. గద్వాలలో కలుషిత నీటి కలకలం రేగింది. కలుషిత నీటిని తాగిన 50 మంది బాధితులు ఉండడంతో ఒక్కసారిగా హాస్పిటల్ ఒక వార్డులో అంత వారే ఉన్నారు. వాంతులు, విరేచనాలతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు.

కలుషిత నీరు తాగి 50 మంది గురై 25 మంది దాకా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు, మరి కొంతమంది వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం నుంచి పరిస్థితి మారిపోయింది. అధిక సంఖ్యలో బాధితులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులకు పరిగెడుతున్నారు. వేదనగర్, గంటగేరి, మొమిన్ మహాళ్ల, ధరూర్ మెట్టు ప్రాంతాల్లో నీటి సరఫరా కలుషితమవుతున్నాయని తాగునీరు కలుషితమైనట్లు కాలనీవాసులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ 50 మందికిపైగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పరిస్థితి నిలకడగా లేకపోవడంతో కర్నూల్ హాస్పిటల్ కి రెఫర్ చేసినట్లు డ్యూటీ డాక్టర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement