Friday, September 6, 2024

MBNR: అథ్లెటిక్స్ లో సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించిన విద్యార్థికి సత్కారం…

అచ్చంపేట, జూన్ 7 (ప్రభ న్యూస్) : రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఎంఎస్ఎన్ స్కూల్ లో చదువుతున్న నల్లమల విద్యార్థి అత్యంత ప్రతిభ కనబరిచి సిల్వర్ మెడల్ కైవసం చేసుకోవడం హర్షించదగ్గ విషయమని ఆ స్కూల్ చైర్మన్ సీఎం రెడ్డి అన్నారు.

జూన్ 5, 6 తేదీల్లో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన 10వ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఎంఎస్ఎన్ స్కూల్ విద్యార్థి ఆర్.శివరామకృష్ణ అండర్ టెన్ విభాగంలో 80 మీటర్ల పరుగు పందెంలో సిల్వర్ మెడల్ సాధించి రికార్డు నెలకొల్పాడు. శుక్రవారం విద్యార్థి శివరామకృష్ణను ఎంఎస్ఎన్ స్కూల్ చైర్మన్ సీఎం రెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మన్సూర్ ఖాన్, పిఈటి లు రాజేందర్, సైదులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement