అచ్చంపేట, ఏప్రిల్ 2 (ప్రభ న్యూస్) : ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మైనర్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన ఘటన అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూరు మండల పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.
బల్మూర్ ఎస్సై బాలరాజు ఫోన్ లో తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని ఒక గ్రామంలో నివశిస్తున్న 14 సంవత్సరాల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన ఒక ఆటో డ్రైవర్ అమ్మాయిపై ఏప్రిల్ ఒకటవ తేదీన అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఈరోజు ఉదయం ఫిర్యాదు చేశారని తెలిపారు. ఫిర్యాదుపై విచారణ చేస్తున్నామని, నిజమని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
- Advertisement -