గద్వాల ప్రతినిధి, మే 13 (ప్రభ న్యూస్): గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డులో ఉదయాన్నే బూతు నంబర్ 215 లో ఓటు హక్కును వినియోగించుకున్నారు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి బిఎం.సంతోష్. ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఆయన తెలిపారు.
అదేవిధంగా గద్వాల నియోజకవర్గంలోని ధరూరు మండలం లోని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సొంత గ్రామమైన బూరెడ్డిపల్లి గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దంపతులు. ఏడు గంటలకే పోలింగ్ కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున ఓటర్లు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూలో నిలబడ్డారు.
నారాయణపేట జెడ్పి చైర్పర్సన్ కె. వనజ ఆంజనేయులు గౌడ్ లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఇవాళ జరిగిన పోలింగ్ లో నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని తమ సొంత గ్రామమైన మంథన్ గోడ్ లోని 129వ పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు .భర్త ఆంజనేయులు గౌడ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఓటు వేశారు.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇవాళ జరిగిన పోలింగ్ లో నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 164వ పోలింగ్ బూత్ లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు .మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు పి.నరసింహ గౌడ్ ,కే. రాజేష్ కుమార్ గౌడ్ లుకూడా వారితో పాటు వచ్చి ఓటు వేశారు.