జడ్చర్ల : రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని మాజీ మంత్రి , స్థానిక ఎమ్మెల్యే డా. లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దాదాపు 63 మంది లబ్దిదారులకు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలో ఏ ప్రభుత్వ హయాంలో కూడా పేదలకు ఆపదలో ఉన్న వారికి ఇంత పెద్ద మొత్తంలో సిఎం సహాయనిధి అందజేయలేదని ఎంతో మంది అప్పటి నాయకుల చుట్టు తిరిగి వేసారిన రోజులు ఇంకా మర్చిపోలేదన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందుతుంది అని అన్నారు. పేదింటి ఆడపడుచుల పెళ్లిల్లకు కళ్యాణ లక్ష్మి , రైతు పెట్టుబడులకు రైతుబంధు , ప్రతి రైతుకు 5 లక్షల రూపాయల ఇన్సురెన్స్ తో రైతుబీమా , పేద పిల్లల చదువులకు ఇం గ్లీష్ మీడియంలో గురుకుల పాఠశాలలు , ముసలి వాళ్లకు ఆసరా , ఒంటరి మహిళలు , వికలాంగులకు పెన్షన్లు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు ఉన్నాయన్నారు. మండలంలో దాదాపు 63 మంది లబ్దిదారులకు 43 లక్షల రూపాయలను అందజేయడం జరుగుతుంది అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అంటే పనిచేసే ప్రభుత్వమని ప్రజలు పనిచేసే నాయకుల వెంట ఉండాలన్నారు.
ప్రత్యేక మున్సిపాలిటీ పరిశీలిద్దాం …
ఇటీవల జడ్చర్ల మున్సిపాలిటీని ప్రత్యేక మున్సిపాలిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ ఏర్పడ్డ అఖిల పక్షం నాయకులు ఎమ్మెల్యే డా.లక్ష్మారెడ్డిని కలిసి తమ డిమాండ్లను తెలిపారు. స్పందించిన ఆయనప్రత్యేక మున్సిపాలిటీ అనే అంశం తన పరిధిలో లేదని కానీ ఒకవేళ బాదేపల్లి , జడ్చర్ల రెండు మున్సిపాలిటీలు ఏర్పడితే తనకు సంతోషమేనని అప్పుడు ఇద్దరు చైర్మన్‌లు , వైస్ చైర్మన్‌లు , కౌన్సిలర్ స్థానాలు పెరుగుతాయని అన్నారు. ఒకవేళ రెండు మున్సిపాలిటీలు ఏర్పడే అవకాశాలు ఉంటే పరిశీలిద్దాం అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోడ్గల్ యాదయ్య , టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘుపతి రెడ్డి , పార్టీ నాయకులు పిట్టల ముర ళి , బృందం గోపాల్ , శంకర్ నాయక్, ఇంతియాజ్ , ప్రణిల్ చందర్ , బాలు ముదిరాజ్ , ప్రశాంత్ రెడ్డి , నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..
Advertisement
తాజా వార్తలు
Advertisement