Friday, November 22, 2024

చెక్‌ డ్యామ్‌ పనులపై..

దేవరకద్ర : దేవరకద్ర నియోజకవర్గంలో కొన్ని మిగిలిపోయిన చెక్‌ డ్యామ్‌ పనులు త్వరగా పూర్తి చేసేందుకు టెండర్లు పిలిచి ప్రారంభం చేయాలని స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో జీరో అవర్‌లో మాట్లాడుతూ కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో వాగుల మీద చెక్‌ డ్యామ్‌లు నిర్మించాలని ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసి చెక్‌ డ్యామ్‌ కు టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయడం జరిగింది ఆయన తెలిపారు. నియోజకవర్గంలో రెండు పెద్ద వాగులు ఉన్నాయని పూర్తి చేసుకుని దాదాపు రెండు కిలోమీటర్ల మేర నీళ్లు నిలపటం వల్ల రైతులు చాలా సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. గత సంవత్సరం కొన్ని చెక్‌ డ్యామ్‌ లు మిస్‌ కావడం జరిగిందని ఆయన చెప్పారు. అందులో కోయిల్‌ సాగర్‌ నుండి రామన్‌పాడు వరకు 36 కిలో మీటర్ల ఊకచెట్టువాగు ఉందని ఆయన తెలిపారు. అలాగే నిజాలాపూర్‌ నుంచి సరళాసాగర్‌ వరకు కందుకూరు వాగు ఉన్నదని ఆయన చెప్పారు. రామన్‌ పాడు నుంచి ఫామ్‌ పురం వరకు వాగు ఉన్నది. ఇవి చివరి సమయంలో మిగిలిపోయిన చెక్‌ డ్యామ్‌లను రెండవ ఫేజ్‌ లో తీసుకోవడం జరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. మొదటి ఫేజ్‌లో మిగిలిపోయిన చెక్‌ డ్యామ్‌లను రెండవ ఫేజ్‌లో తీసుకుని అధికారులకు వెంటనే ఆదేశాలు ఇచ్చి టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయాలని ఆయన మంత్రిని కోరారు. మంత్రి హరీష్‌ రావు స్పందిస్తూ మిగిలిపోయిన చెక్‌ డ్యామ్‌లు నిర్మాణం పనులు వెంటనే పూర్తి చేయుటకు చర్యలు తీసుకుంటామని సభలో మంత్రి హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement