Saturday, November 23, 2024

MBNR : అచ్చంపేటలో పోలీసుల కార్టన్‌ అండ్‌ సెర్చ్‌

అచ్చంపేట, ఏఫ్రిల్‌ 29 (ప్రభ న్యూస్‌) నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట పట్టణంలోని గోకుల్‌నగర్‌ కాలనీలో సోమవారం ఉదయం 4 గంటల నుండి కార్టన్‌ అండ్‌ సెర్చ్ నిర్వ‌హించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా అడిషనల్‌ ఎస్పీ సిహెచ్‌ రామేశ్వర్‌ అన్నారు.

శాంతి భద్రతల పరిరక్షణ , లోక్‌స‌భ‌ ఎన్నికలలో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉపయోగించుకునేందుకు గాను ఈ సెర్చ్‌ ఆఫరేషన్‌ ముఖ్య ఉద్దేశ్యము అని తెలిపారు. కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి అనుమానస్పద వ్యక్తులు, నిషేదిత ఆయుధాలు, వస్తువులు, అక్రమంగా నిల్వవుంచిన మధ్యం, నిషేదిక నాటు సారా గురించి ఆరా తీయడం జరిగిందని తెలిపారు. సెర్ఛ్‌ ఆఫరేషన్‌లో సరైన ధృవపత్రాలు లేని 70 ద్విచ‌క్ర వాహనాలు, 1 కారు, 1 ఆటోలను అదుపులోకి తీసుకోవడం జరిగిందని అన్నారు.

- Advertisement -

అదుపులోకి తీసుకున్న వాహనదారులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, తమ వాహనాలకు సంబంధించిన ఒరిజినల్‌ ఓనర్‌షిప్‌ డాక్యుమెంట్స్‌ లేదా ఆన్‌లైన్‌లోని ఎమ్ వ్యాలెట్‌లో వాహనానికి సంబందించిన డాక్యుమెంట్స్‌ను చూపించి అలాగే ఇతరుల నుండి వాహనాలను కొనుగోలు చేసినట్లయితే వాటికి సంబందించిన డాక్యుమెంట్లను చూపించి తమ వాహనాలను తీసుకుపోవచ్చని తెలిపారు. సరైన డాక్యుమెంట్లు లేని వాహనాలపై చట్టపరంగా చర్య తీసుకోబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట సీఐ రవింధర్‌, ఎస్సై రాము, దాదాపు 90 మంది పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement