Saturday, November 23, 2024

పాఠశాలల్లో కరోనా కేసులు..

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని వివిధ పాఠశాలల్లో కరోనా కేసులు నమోదవుతుండటంతో భయాందోళనలకు గురి చేస్తుంది. కోవిడ్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్‌ విధించగా , దాదాపు సంవత్సరం పాటు అన్ని విద్యాసంస్థలను మూసి వేసి రెండు నెలల నుంచి పున:ప్రారంభించింది. విద్యాశాఖ పలు జాగ్రత్తలు సూచించింది. థర్మల్‌ స్కానింగ్‌ , మాస్కులు ధరించడం , శానిటైజర్‌ వినియోగించాలని , తరగతి గదుల్లో బెంచీకి ఇద్దరు భౌతిక దూరం పాటించాలని ఆదేశించింది. చాలా పాఠశాలల్లో ఈ నిబంధనలు పాటిస్తున్నా కొన్ని చోట్ల గాలికొదిలేస్తున్నారు. జిల్లాలో 253 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో చాలా పాఠశాలల్లో 250 నుంచి 550 వరకు విద్యార్థులు చదువుతున్నారు. ఈ క్రమంలో ఎక్కువ మొత్తంలో విద్యార్థులున్న బడుల్లో తరగతి గదికి కేవలం 20 మంది విద్యార్థులను మాత్రమే కూర్చోబెట్టి బోధించడం , ఇంటర్వల్‌ , మధ్యాహ్న భోజనం సమయంలో ఎక్కువ మంది గుమిగూడకుండా చూడటం పెద్ద సవాలుగా మారింది. మరికొన్ని పాఠశాలల్లో 50 శాతం మందిని ఒకసారి , మరో 50 శాతం వారిని మరోసారి బయటకు వదులుతున్నట్లు హెచ్‌ఎంలు చెబుతున్నారు. అయితే కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు శానిటైజర్లు అందిస్తుండగా , మరికొన్ని పాఠశాలల్లో శానిటైజర్లు , మాస్కుల కొరత ఉంది. తక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో పెద్దగా ఇబ్బందులు లేవు. అన్ని పాఠశాల ల్లో కరోనా టెస్టులు ఎక్కువగా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో టెస్టింగ్‌ , ట్రేసింగ్‌ , ట్రీట్‌మెంట్‌ విధానాన్ని అనుసరిస్తున్నారు. పాజిటివ్‌ అని రిపోర్టు వచ్చిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చివారిని ఇంటికి పంపించి , వైద్య అధికారులు పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించే విధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నారు. ఇంటి నుంచే విద్యార్థులు మాస్కులతో వస్తున్నారు. ఆరుబయట థర్మల్‌ స్కానింగ్‌ చేసిన అనంతరం వారిని పాఠశాలలోనికి అనుమతిస్తున్నారు. తరగతి గదిలో బెంచీకి ఇవ్దరు విద్యార్‌థులు మాత్రమే కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. మొత్తంగా గదిలో 20 మంది విద్యార్థులు కూర్చుంటారు. మిగతా సమయాల్లో ఎక్కువ మంది గుమిగూడకుండా 50 శాతం మంది మొదటి , మరో 50 శాతం మందిని తర్వాత వదులుతున్నారు. భౌతిక దూరం , ఎవరి వాట ర్‌ బాటిల్‌ వారే తెచ్చుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement