గద్వాల (ప్రతినిధి) నవంబర్ 23 (ప్రభ న్యూస్) : గద్వాల నియోజకవర్గం కేటీ దొడ్డి మండల పరిధిలోని వాగుతాండ, తూర్పు తాండ, పూజారి తాండ, తోటతాండ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దంపతులు ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ద్వారా కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రజల మధ్యకి వెళ్తున్నారు. తండాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వారి వేషధారణలో నృత్యాలు చేస్తూ ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు తాండాలోని ప్రజలను కేవలం ఓటు వేసే యంత్రాలుగా మాత్రమే ఉపయోగించుకున్నారు.. కానీ కేసీఆర్ తండాలోని ప్రజలను కూడా గుర్తించి వారికి ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసి మన తాండ మన పరిపాలన మన రాజ్యం అని పాలన కల్పిస్తూ తండా ప్రజలకు కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి ఎలాంటి మధ్యవర్తి లేకుండా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందే విధంగా తాండాల ప్రజలు గుర్తింపునిచ్చి తండాల అభివృద్ధి కోసం కృషి చేసిన ఏకైక నాయకులు కేసీఆర్ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అన్నివర్గాల ప్రజలకు అందిస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు.
ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి బండ్ల జ్యోతి మాట్లాడుతూ.. రైతులకు, మహిళలకు, యువతకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ బడుగు, బలహీన వర్గాల ప్రజలందరికీ ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలను రెట్టింపు చేస్తూ మేనిఫెస్టో బీఆర్ఎస్ పార్టీ మరొక్కసారి అధికారంలో వచ్చిన వెంటనే చెప్పిన పథకాలను వెంటనే దశలవారీగా అమలు చేస్తారని ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ ఎన్నో పథకాలను అమలు చేశారన్నారు. భవిష్యత్తులో కూడా ఇవన్నీ పథకాలు ప్రజలకు అమలు చేసే విధంగా కేసీఆర్ కృషి చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు కౌన్సిలర్ పాల్గొన్నారు.